జగన్ ని కలిసిన నాగార్జున అందుకేనా ?


 Political meeting between Nagarjuna and YS Jagan

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ ని ఈరోజు అక్కినేని నాగార్జున కలిసాడు దాంతో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి . గతకొంత కాలంగా నాగార్జున జగన్ తో సన్నిహితంగా మెలుగుతున్న విషయం తెలిసిందే . అంతేకాదు జగన్ పార్టీ తరుపున నాగార్జున లేదా అమల పోటీ చేయడం ఖాయమని వార్తలు కూడా వచ్చాయి . అయితే వాటిపై నాగార్జున పెద్దగా స్పందించలేదు .

 

కట్ చేస్తే ఈరోజు జగన్ తో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని ఇంట్లో నాగార్జున అరగంట పాటు సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో మళ్ళీ ప్రకంపనలు మొదలయ్యాయి . నాగార్జున జగన్ పార్టీ తరుపున ప్రచారం చేస్తాడా ? లేక పోటీ చేస్తాడా ? అన్న స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి . జగన్ తో భేటీ అయిన తర్వాత మీడియా తో మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు నాగార్జున . అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ కు నాగార్జున మద్దతు ఇవ్వడం ఖాయమని తేలిపోయింది . ఇక పోటీ అన్నది తేలాల్సి ఉంది .

English Title:  Political meeting between Nagarjuna and YS Jagan