మహేష్ బావ పై ప్రశంసల వర్షం


positive reports on sudheer babu sammohanam

సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే పలువురు ప్రముఖులు హీరో సుధీర్ బాబు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . తాజాగా ఈ హీరో నటించిన చిత్రం ” సమ్మోహనం ” . మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై రూపొందిన సమ్మోహనం చిత్రం సినిమా రంగం నేపథ్యంలో తెరకెక్కింది . సుధీర్ బాబు సరసన హాట్ భామ అదితిరావు హైదరి నటించింది ఇక కీలక పాత్రలో సీనియర్ నరేష్ నటించాడు . కాగా సమ్మోహనం చిత్రాన్ని చూసిన పలువురు సినీరంగ ప్రముఖులు సుధీర్ బాబు నటనకు ముగ్దులయ్యారు .

సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం సామాన్య విషయం కాదని అలాంటి అద్భుత నటనని ప్రదర్శించి మమ్మల్ని ఆశ్చర్యపరిచాడని అంటున్నాడు దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి . అసలు సుధీర్ బాబు ఇంత అద్భుతంగా చేస్తాడని అస్సలు అనుకోలేదు నేను అనుకున్న దాని కంటే అద్భుతంగా చేసాడు అంటూ పొగడ్తలు కురిపించాడు . అలాగే హీరోయిన్ అదితిరావు హైదరీ కూడా సుధీర్ బాబు ని ఆకాశానికి ఎత్తేసింది . సుధీర్ తో అంతగా పరిచయం లేదు నాకు , కానీ ఈ సినిమా సమయంలో షూటింగ్ గ్యాప్ లో చాలా సైలెంట్ గా ఉండేవాడు షాట్ రెడీ అనగానే పాత్రలో లీనమై పోయేవాడు , అతడి పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యాను అంటూ మహేష్ బాబు బావ సుధీర్ బాబుని మెచ్చుకుంటోంది . చిత్ర బృందం మాత్రమే కాకుండా ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు సైతం మహేష్ బావ ని పొగుడుతున్నారు . ఇక ఈ సినిమా జూన్ 15న విడుదల అవుతోంది .