మరో హీరోతో రొమాన్స్ చేయనున్న టాక్సీ వాలా భామ


Priyanka Jawalkar romance with Raviteja 

విజయ్ దేవరకొండ సరసన టాక్సీ వాలా చిత్రంలో నటించి సూపర్ హిట్ కొట్టేసిన భామ ప్రియాంక జవాల్కర్ తాజాగా మాస్ మహారాజ్ రవితేజ తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతోంది . ఇటీవలే అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో నిరాశపరిచిన రవితేజ తాజాగా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు కాగా అందులో ఒక భామగా ప్రియాంక జవాల్కర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది .

ఇక మరో భామ కూడా హాట్ భామే! ఇంతకీ ఆ భామ ఎవరో తెలుసా ……. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన శృంగార దేవత పాయల్ రాజ్ పుత్ . ఈ భామని కూడా ఒక హీరోయిన్ గా ఎంపిక చేశారట . ఇద్దరు హాట్ భామలు రవితేజ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు . టాక్సీ వాలా చిత్రం ప్రియాంక జవాల్కర్ కు మొదటి చిత్రం . కాగా మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టేసిన ఈ భామ ఫుల్ జోష్ గా ఉంది ఎందుకంటే అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి మరి అందుకు .

English Title: Priyanka Jawalkar romance with Raviteja