విజయ్ దేవరకొండ హీరోయిన్ తో అఖిల్


Priynka jawalkar romance with Akhil

టాక్సీ వాలా చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించి మెప్పించిన భామ ప్రియాంక  జవాల్కర్ . విజయ్ దేవరకొండ  సరసన మొదటి సినిమాలోనే నటించే చాన్స్ కొట్టేసిన ఈ హాట్ భామ తాజాగా రవితేజ సరసన నటించడానికి సిద్ధం అవుతోంది . టాక్సీ వాలా ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు అఖిల్ సరసన కూడా నటించడానికి సిద్ధమవుతోంది ప్రియాంక జవాల్కర్ .

 

అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ ని తీసుకోనున్నట్లు సమాచారం . మొదటి చిత్రంతోనే హిట్ కొట్టిన ఈ భామ తాజాగా రవితేజ తో డిస్కో రాజా చిత్రంలో  రొమాన్స్ చేయనుంది , ఆ తర్వాత అఖిల్ తో . మరి ఈ ఇద్దరితో హిట్ కొడుతుందో చూడాలి .

 

English Title: Priynka jawalkar romance with Akhil