రజనీకాంత్ కొత్త చిత్రం పేరేంటో తెలుసా


సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా ……. ”దర్బార్ ” . రజనీకాంత్ సరసన నయనతార నటించనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది . మురుగదాస్ దర్శకుడు అంటే సామజిక కోణంలో ఇతివృత్తం ఉంటుందన్న విషయం తెలిసిందే . 
 
ఈ సినిమాని కూడా సందేశాత్మకంగా అలాగే వినోదాత్మకంగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు మురుగదాస్ . ఇక రజనీకాంత్ కు ఈ సినిమా 167 వ సినిమా కావడం విశేషం . ఈరోజు దర్భార్ ఫస్ట్ లుక్ ని , పోస్టర్ ని రిలీజ్ చేసారు . ఈ పోస్టర్ తో  రజనీకాంత్ అభిమానులు సంతోషంతో పొంగిపోవడం ఖాయం . 
 
రోబో సీక్వెల్ 2. ఓ తో రజనీకాంత్ తన ఫ్యాన్స్ ని నిరాశపరిచాడు , ఇక పేట చిత్రం తమిళ్ లో హిట్ అయ్యింది కానీ తెలుగులో మాత్రం ప్లాప్ అయ్యింది . దాంతో దర్బార్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమనే ధీమాలో ఉన్నారు రజనీ ఫ్యాన్స్ .