హీరో అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు


Rakul preet singh brother aman turned hero

హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా పరిచయం కానున్నాడు . రేపు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అమన్ హీరోగా పరిచయం కానున్న సినిమా అతిరథ మహారథుల సమక్షంలో ప్రారంభం కానుంది . సినిమా రంగం అంటేనే వారసుల రాజ్యం అయితే ఈ రాజ్యంలోకి హీరోయిన్ ల తమ్ముళ్లు వచ్చింది తక్కువ ఒకవేళ ఒకరిద్దరు వచ్చినా నిలదొక్కుకున్న దాఖలాలు అయితే లేవు .

 

ఢిల్లీ భామ అయిన రకుల్ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ లో అంతగా సినిమాలు లేకుండాపోయాయి ప్రస్తుతం . స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తోంది . ఇక రేపు తన తమ్ముడ్ని హీరోగా టాలీవుడ్ లో దింపుతోంది . దాసరి లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రంతో అమన్ హీరోగా సక్సెస్ సాధిస్తాడా చూడాలి .

English Title : Rakul preet singh brother aman turned hero