అన్నయ్య ప్లాప్ తమ్ముడు హిట్


Ramcharan gets flop varun tej gets succes

మెగా బ్రదర్స్ నటించిన రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో దిగాయి. అన్నయ్య రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం జనవరి 11న విడుదల కాగా ఆ మరుసటి రోజున అంటే జనవరి 12న వెంకటేష్ , వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 చిత్రం విడుదల అయ్యింది. అయితే చరణ్ సినిమా డిజాస్టర్ కాగా వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 మాత్రం సూపర్ హిట్ కొట్టేసింది.

దాంతో అన్నయ్య ఫట్టు తమ్ముడు హిట్టు అని అంటున్నారు. కెరీర్ తొలినాళ్ళ లో వరుస ప్లాప్ లతో సతమతం అయిన వరుణ్ ఫిదా సినిమాతో సూపర్ హిట్ కొట్టేసాడు , ఆ సినిమా తర్వాత తొలిప్రేమ తో మరో హిట్ కొట్టాడు అయితే గత నెలలో విడుదలైన అంతరిక్షం చిత్రం మాత్రం ప్లాప్ అయ్యింది. ఇక ఏడాది తొలిభాగంలో మరో హిట్ కొట్టేసాడు వరుణ్. చరణ్ వినయ విధేయ రామ మాత్రం ఘోర పరాజయం పొందింది.

 

 

English Title: Ramcharan gets flop varun tej gets succes