మే 21 నుండి ఆర్ ఆర్ ఆర్ మూడో షెడ్యూల్


యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ , మెగా పవర్ స్టార్ రాంచరణ్ లు నటిస్తున భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ ఎట్టకేలకు మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది . రాంచరణ్ కాలుకి గాయం కావడం , ఎన్‌టి‌ఆర్ చేతికి కూడా స్వల్ప గాయం కావడంతో పూణే లో జరగాల్సిన మూడో షెడ్యూల్ వాయిదాపడిన విషయం తెలిసిందే . అయితే ఎట్టకేలకు ఈనెల 21 నుండి హైదరాబాద్ లో ఆర్ ఆర్ ఆర్ మూడో షెడ్యూల్ ని సెట్స్ మీదకు తీసుకెళ్ల నున్నారు జక్కన్న  అండ్ కొ .
ఎన్‌టి‌ఆర్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా మరో కథానాయికని ఎంపిక చేయాల్సి ఉంది , అలాగే చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తోంది . ఆర్ ఆర్ ఆర్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ లో భారీ సెట్ వేశారు . దాంట్లో ఈ మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది . అజయ్ దేవ్ గన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని 2020 జూలై 30 న విడుదల చేయనున్నారు .