అర్జున్ రెడ్డి హీరోయిన్ కు గోల్డెన్ ఛాన్స్


Shalini pandey gets bollywood film

అర్జున్ రెడ్డి  చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించి బోల్డ్ సన్నివేశాల్లో జీవించిన భామ షాలిని పాండే . శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించిన షాలిని పాండే కు ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి పోవచ్చని ఆశించింది కానీ ఈ భామ ఆశలు అన్నీ అడియాసలే అయ్యాయి . అర్జున్ రెడ్డి తర్వాత చెప్పుకోతగ్గ స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు దాంతో కాస్త నిరుత్సాహపడింది షాలిని పాండే.

కట్ చేస్తే తాజాగా ఈ భామకు బాలీవుడ్ లో గోల్డెన్ ఛాన్స్ లభించింది . పరేష్ రావెల్ కొడుకు ఆదిత్య హీరోగా రూపొందుతున్న ” బాంఫాడ్ ” చిత్రంలో హీరోయిన్ గా షాలిని పాండే కు ఛాన్స్ వచ్చింది . టాలీవుడ్ లో ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న ఈ భామకు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ తగలడంతో చాలా సంతోషంగా ఉంది . హాట్ గా నటించడానికి ఏమాత్రం వెనుకాడని ఈ భామకు బాలీవుడ్ కలిసి వస్తుందేమో చూడాలి.

English Title: Shalini pandey gets bollywood film