ప్రియుడి కోసం తపించిపోతున్న శృతి హాసన్


Shruti haasan gets emotional for michale corsale

విదేశీ ప్రియుడి మోజులో ఉంది అందాల భామ శృతి హాసన్ , ఈరోజు శృతి బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే పుట్టినరోజు కావడంతో అతడి కోసం గ్రీటింగ్స్ పంపించింది శృతి . ప్రియుడేమో లండన్ లో ప్రేయసి ఏమో ఇండియాలో దాంతో విరహంతో రగిలిపోతోంది శృతి హాసన్ . గతకొంత కాలంగా శృతి హాసన్ – మైఖేల్ కోర్సలే ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే .

 

ప్రియుడి మోజులో పడిన ఈ భామ సినిమాలను పక్కన పెట్టి మైఖేల్ తో రచ్చ రచ్చ చేసింది . అయితే మైఖేల్ ఇప్పుడు లండన్ లో ఉన్నాడు , దాంతో అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఆవేదనని కూడా వ్యక్తం చేసింది శృతి . సినిమాలను పక్కన పెట్టిన ఈ భామ మైఖేల్ ని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా ! ఈ ప్రేమ చూడలేక పోతున్నామని అంటున్నారు నెటిజన్లు . ఇక ఇండియాలో ఎవరూ లేనట్లు ఫారినర్ తో ఈ ప్రేమాయణం ఏంటి ? అంటూ  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా .

English Title: Shruti haasan gets emotional for michale corsale