శృతి హాసన్ ని మాయ చేస్తున్న మోసగాడు


shruti haasan living in relation with michael corsale

అందాల భామ శృతి హాసన్ కు సమయం తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయట, అంతగా శృతి హాసన్ ని మాయ చేస్తున్న మోసగాడు ఎవరో తెలుసా …….. ఇంకెవరు …… శృతి హాసన్ ప్రియుడు మైఖేల్ కోర్సలే . గతకొంత కాలంగా మైఖేల్ తో సహజీవనం చేస్తోంది శృతి హాసన్ . అయితే ఈ ఇద్దరూ జంటగా యావత్ ప్రపంచం చుట్టి వస్తున్నారు కానీ ప్రియుడా ? అని అడిగితే మాత్రం ఫ్రెండ్ మాత్రమే అని తెలివిగా సమాధానం చెబుతోంది . గతకొంత కాలంగా సినిమాలను పక్కన పెట్టి మైఖేల్ తోనే గడుపుతోంది . ఇతడితో గడుపుతున్న సమయంలో అసలు టైం తెలియడం లేదట ఈ భామకు అంతగా నవ్విస్తున్నాడట , ప్రపంచాన్ని మరిచిపోయేలా చేస్తున్నాడట .

అవును మరి నిజమే శృతి చెబుతున్నది . హాయిగా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు దాన్ని మరింతగా మలుచుకోవాల్సింది పోయి మైఖేల్ వెంట పడుతూ కెరీర్ ని అగమ్యగోచరంలో పడేలా చేసుకుంది . తెలుగు ,తమిళ , హిందీ బాషలలో పెద్దగా సినిమాలేవీ లేవు ఈ భామ చేతిలో . ఉన్నదల్లా మైఖేల్ కోర్సలే . అతడితోనే జీవితం అంటూ ఎంజాయ్ చేస్తోంది .

English Title: shruti haasan living in relation with michael corsale