ఎంజాయ్ చేస్తున్న రజనీకాంత్ కూతురు


Soundarya Rajinikanth get trolled for their honeymoon

విశాగన్ వనంగమూడి ని పెళ్లాడిన రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజనీకాంత్ హనీమూన్ లో ఫుల్లుగా ఎంజాయ్  చేస్తోంది . భర్త తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది . అయితే దేశం యావత్తు అమరవీరులను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటే సౌందర్య ఆ సోయి మర్చిపోయి ఇలా ఎంజాయ్ చేసే ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి ? అని నిప్పులు చెరుగుతున్నారు .

 

పుల్వామా సంఘటన తో భారత్ ఉలిక్కిపడింది , అమరులైన సైనికుల త్యాగం ని గుర్తు చేసుకుంటూ నీరాజనాలు పలుకుతున్న ఈ సమయంలో రజనీకాంత్ కూతురు ఇలా ఫోజులు ఇవ్వడం నెటిజన్లకు నచ్చలేదు అందుకే సౌందర్య పై మండిపడుతున్నారు . సౌందర్య కు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం . ఈనెల 11 న సౌందర్య విశాగన్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .

 

English Title: Soundarya Rajinikanth get trolled for their honeymoon