నటుడిగా సౌతాఫ్రికాలో సెటిల్ అవుతానంటున్న సునీల్


Sunil turned cricketer for good cause

హాస్య నటుడు సునీల్ సౌతాఫ్రికాలో సెటిల్ అవుతానని , అక్కడ చిత్రాల్లో నటించే అర్హత నాకు మాత్రమే ఉందని నవ్వుల పువ్వులు పూయించాడు సునీల్ . నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని లెమన్ ట్రీ హోటల్ లో టాలీవుడ్ క్రికెట్ టీమ్ సమావేశంలో సునీల్ ఈ వ్యాఖ్యలు చేసి నవ్వించాడు . క్యాన్సర్ అవేర్ నెస్ కోసం సౌతాఫ్రికా లో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసారు .

 

కాగా అక్కడ ఉన్న తెలుగువాళ్ళతో టాలీవుడ్ హీరోలు క్రికెట్ పోటీలలో పాల్గొనడానికి వెళ్తున్నారు కాగా అందులో సునీల్ కూడా ఒకరు . అయితే నేను నల్లగా ఉంటాను కాబట్టి అక్కడి చిత్రాల్లో నటించే అర్హత నాకు ఒక్కడికే దక్కుతుందని , దాంతో ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదుగుతాను అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు . హాస్య నటుడిగా బాగున్నా …… హీరోగా మారి కెరీర్ ని చేజేతులా నాశనం చేసుకున్నాడు సునీల్ . ఇక ఇపుడేమో మళ్ళీ కమెడియన్ వేషాలకు వచ్చాడు కానీ ఆశించిన స్థాయిలో మాత్రం బిజీ కాలేకపోతున్నాడు పాపం .

English Title : Sunil turned cricketer for good cause