కల్కి ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్


డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి చిత్రం ఈనెల 24 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మహర్షి చిత్రంతో కలిసి కల్కి ట్రైలర్ ని రిలీజ్ చేసారు ఆ చిత్ర బృందం . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు . ఇప్పటికే టీజర్ , ఫస్ట్ లుక్ లతో అంచనాలు పెంచిన కల్కి తాజాగా ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెంచింది .

ఈ ట్రైలర్ కు థియేటర్ లో బ్రహ్మాండమైన స్పందన వస్తోంది . మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి చిత్రం ఈరోజు విడుదల అవుతుండటంతో ఆ సినిమాతో పాటుగా కల్కి ట్రైలర్ ని విడుదల చేసి అద్భుతమైన స్పందన ని సొంతం చేసుకున్నారు కల్కి బృందం . ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో తప్పకుండా సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .