సైరా రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా


Syeraa narasimha reddy new release date
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్ర విడుదల మరోసారి వాయిదాపడింది. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా వెల్లడించాడు. సైరా చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సైరా చిత్రం 200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందని , కేవలం నాన్న గారి కోసమే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించానని , అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నానని అంటున్నాడు చరణ్.

అసలు ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం , అయితే మేకింగ్ ఆలస్యం అవుతుండటంతో ఈ ఏప్రిల్ లో విడుదల అనుకున్నారు . కట్ చేస్తే ఇంకా రెండు నెలల పాటు షూటింగ్ చేయాల్సి ఉందట దాంతో హడావుడిగా చేసే బదులు మంచి టైం చూసుకొని రిలీజ్ చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యాడట చరణ్ అందుకే దసరాకు సైరా ని దింపాలని చూస్తున్నాడు. చరణ్ తాజాగా నటించిన వినయ విధేయ రామ చిత్రం ఈనెల 11 న విడుదల కానుంది.