తమన్నాపెళ్లిని ఆపేసిన వెంకటేష్


Tamannah postponed her marriage next five years

హాయిగా పెళ్లిచేసుకొని కాపురం చేసుకుందామనుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఆశలు అడియాసలు చేసాడు సీనియర్ హీరో వెంకటేష్ .  తమన్నా పెళ్లి ని వెంకటేష్ ఆపేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఎఫ్ 2 విజయం సాధించకపోతే తప్పకుండా పెళ్లి చేసుకొని కాపురం చేసుకునేది తమన్నా . కానీ అనూహ్యంగా వెంకటేష్ తో కలిసి నటించిన ఎఫ్ 2 ప్రభంజనం సృష్టించడంతో పెళ్లి పక్కన పెట్టేసింది .

ఎఫ్ 2 ఇచ్చిన విజయోత్సాహంతో మరో అయిదేళ్ల వరకు పెళ్లి గురించి ఆలోచించేది లేదంటోంది . ఎందుకంటే ఎఫ్ 2 సంచలన విజయం సాధించింది దానికి తోడు సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా నటిస్తోంది కాబట్టి . సైరా  చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడంతో ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ధీమాగా ఉంది తమన్నా . అలాగే పలు చిత్రాల్లో నటిస్తోంది కాబట్టి మరో అయిదేళ్ల వరకు పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పేస్తోంది తమన్నా . సక్సెస్ ఇచ్చిన ఉత్సాహం అంటే ఇదే మరి .

English Title: Tamannah postponed her marriage next five years