ఎన్టీఆర్ బయోపిక్ పై తేజ సంచలన వ్యాఖ్యలు


Teja sensatioanal comments on NTR kathanayakudu

ఎన్టీఆర్ బయోపిక్ లో  భాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు మొదటి భాగంగా వచ్చిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శకులు తేజ . ఎన్టీఆర్ బయోపిక్ కు మొదట దర్శకులు తేజ అన్న విషయం తెలిసిందే . సినిమా పార్రంభం కూడా అయ్యింది అయితే తేజ ఆ సినిమా నుండి అర్దాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది . కట్ చేస్తే తేజ స్థానంలో క్రిష్ దర్శకుడిగా చేరాడు సినిమా తీసాడు . సినిమా రిలీజ్ అయ్యింది డిజాస్టర్ అయ్యింది దాంతో తేజ ఎన్టీఆర్ కథానాయకుడు పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అయ్యాయి.

 

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాని నేను ఇంతవరకు చూడలేదని , సీత షూటింగ్ పనిలో ఉన్నానని అందుకే చూడలేకపోయానని అయినా ఎన్టీఆర్ కథానాయకుడు డాక్యుమెంటరీని తలపించిందని అంటే అది తీసిన వాళ్ళ లోపమే ! అంటూ క్రిష్ పై నింద మోపాడు తేజ . అంటే తేజ చెప్పిన సారాంశం ఏంటంటే ……. క్రిష్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని నేరుగా విమర్శ చేసినట్లే ! అన్నమాట . ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డైలమాలో పడింది .

 

English Title: Teja sensatioanal comments on NTR kathanayakudu