మహేష్ బాబు రికార్డ్ ని బద్దలు కొట్టిన వెంకటేష్


 Venkatesh beats mahesh records in Nizam

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డ్ ని బద్దలు కొట్టాడు హీరో వెంకటేష్ . ఈ సీనియర్ హీరో నటించిన చిత్రం ఎఫ్ 2 . జనవరి 12న విడుదలైన ఎఫ్ 2 సంచలన విజయం సాధించింది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా నటించగా వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటించింది . మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం నైజాం లో  22. 34 కోట్ల షేర్ ని రాబట్టగా ఎఫ్ 2 మాత్రం నెల రోజుల్లోనే 22 . 47 కోట్ల షేర్ ని రాబట్టింది .

 

దాంతో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం రికార్డ్ బద్దలైంది . పూర్తిస్థాయి వినోద ప్రధానంగా తెరకెక్కిన ఎఫ్ 2 ఇప్పటికి కూడా సరైన పోటీ చిత్రం లేకపోవడంతో మంచి వసూళ్లని రాబడుతోంది . వెంకటేష్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా రికార్డు సృష్టిస్తోంది ఎఫ్ 2 . నైజాం లో మహేష్ రికార్డ్ ని బద్దలు కొట్టిన వెంకటేష్ మరిన్ని రికార్డులపై కన్నేశాడు .

English Title: Venkatesh beats mahesh records in Nizam