బాక్సాఫీస్ ని కుమ్మేస్తున్న ఎఫ్ 2


Venkatesh and Varun tej F2 5 days collections

వెంకటేష్వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఎఫ్ 2 చిత్రం సంక్రాంతి రారాజు గా నిలిచింది . జనవరి 12న విడుదలైన ఎఫ్ 2 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . సంక్రాంతి బరిలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు , పేట , వినయ విధేయ రామ చిత్రాలు ఘోర పరాజయం సాధించడంతో ఎఫ్ 2 కు బాగా కలిసి వచ్చింది , దాంతో మొదటి వారంలో ఏకంగా 32 కోట్ల షేర్ రాబట్టింది ఎఫ్ 2 . వెంకటేష్ కెరీర్ లోనే కాకుండా వరుణ్ తేజ్ కెరీర్ లో అలాగే దర్శకులు అనిల్ రావిపూడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఎఫ్ 2 .

వెంకటేష్ కామెడీ టైమింగ్ అదిరిపోవడంతో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతు ఎఫ్ 2 కి జేజేలు పలుకుతున్నారు . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా , మెహరీన్ లు హీరోయిన్ లుగా నటించారు . ఎఫ్ 2 చిత్రం ఇప్పటికే 32 కోట్ల షేర్ రాబట్టగా ఆ జోరు ఇలాగె కొనసాగితే 50 కోట్ల షేర్ అవలీలగా దాటడం ఖాయంగా కనిపిస్తోంది .

English Title: Venkatesh and Varun tej F2 5 days collections