నోటా ఫ్లాప్ అయినందుకు కొంతమంది పండగ చేసుకున్నారట


vijay devarakonda controversial comments on nota

నోటా చిత్రం ఫ్లాప్ అయినందుకు కొంతమంది పండగ చేసుకున్నారని , ఇంకొంతమంది పండగ చేసుకునే మూడ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో విజయ్ దేవరకొండ . అక్టోబర్ 5 న విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం విడుదలైన విషయం తెలిసిందే . తెలుగు , తమిళ బాషలలో విడుదలైన నోటా చిత్రం తెలుగులో ఫ్లాప్ అయ్యింది , ఇక తమిళంలో మాత్రం కాస్త ఫరవాలేదు . అలాగే సినిమా ఫ్లాప్ సంగతి పక్కన పెడితే విజయ్ దేవరకొండ పైన కూడా కొంతమంది పనిగట్టుకొని విమర్శలు చేసారు దాంతో బాగా హర్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ దాంతో పెద్ద పురాణమే రాసాడు సోషల్ మీడియాలో .

నోటా చిత్రం క్రిటిక్స్ కి నచ్చలేదు కానీ తమిళ వాళ్ళకు , జాతీయ మీడియా వాళ్ళకు బాగా నచ్చిందని , అలాగే నోటా ఫ్లాప్ అయినందుకు కొంతమంది పండగ చేసుకున్నారని , సంతోష పడ్డారని …… ఇంకొంతమంది పండగ చేసుకునే మూడ్ లో ఉన్నారని అటువంటి వాళ్ళు వెంటనే పార్టీ చేసుకోవాలని చురకలు అంటించాడు . అంతేనా ఫ్లాప్ అయినంత మాత్రాన యుద్ధం ఆపేది లేదని నేనొక రౌడీ నని ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటానని అంటున్నాడు విజయ్ దేవరకొండ . ఇటీవలే గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరోకు నోటా కాస్త బ్రేక్ వేసింది . అయితే నోటా నాకు ఒక గుణపాఠం అని అంటున్నాడు విజయ్ దేవరకొండ .

English Title: vijay devarakonda controversial comments on nota