వెంకటేష్ ని ఇన్సల్ట్ చేసిన విజయ్ దేవరకొండ


Vijay Deverakonda, Mahesh Babu and Venkatesh
Vijay Deverakonda, Mahesh Babu and Venkatesh

సీనియర్ హీరో టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ని ఇగ్నోర్ చేసాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ . నిన్న మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే . ఈ వేడుకకు వెంకటేష్ తో పాటుగా విజయ్ దేవరకొండ కూడా గెస్ట్ లుగా హాజరయ్యారు . అయితే ఈ వేడుకలో ఎంతసేపు మహేష్ బాబు గురించి మాట్లాడాడు తప్ప వెంకటేష్ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు విజయ్ దేవరకొండ . వెంకటేష్ స్టార్ హీరో పైగా మహర్షి వేడుకకు ముఖ్య అతిథి కూడా .

కానీ అలాంటి వేడుకలో మచ్చుకైనా ఓ మాట వెంకటేష్ గురించి చెప్పాల్సి ఉండే కానీ మాటలలో పడి మర్చిపోయాడో లేక కావాలనే చేసాడో కానీ వెంకటేష్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు విజయ్ దేవరకొండ . అలాగే వెంకటేష్ కూడా తన ప్రసంగంలో మహేష్ గురించి మాట్లాడాడు తప్ప విజయ్ దేవరకొండ గురించి కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఏంటో ? అయితే మహేష్ బాబు మాత్రం తనకు సీనియర్ హీరోలలో వెంకటేష్ అంటే విపరీతమైన అభిమానం అని తన అభిమానాన్ని చాటుకున్నాడు .