నయనతారతో రొమాన్స్ కి సిద్దమౌతున్న విజయ్ దేవరకొండ


Vijay devarakonda romance with Nayanatara

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ నయనతార తో రొమాన్స్ చేయడానికి సిద్దం అవుతున్నాడు . ఈ సినిమా తెలుగు , తమిళ బాషలలో రూపొందనుంది . నయనతార – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అంటే కొత్తగా చెప్పేదేముంది ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడటం ఖాయం . ఇపటికే తెలుగునాట స్టార్ హీరోగా చెలామణి అవుతున్నాడు విజయ్ దేవరకొండ .

 

ఇక అతడికి నయనతార కూడా తోడైతే భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం . నయనతార కు తెలుగులో అలాగే తమిళంలో మంచి మార్కెట్ ఉంది విజయ్ దేవరకొండ తమిళనాట పరిచయం అయ్యాడు కూడా నోటా చిత్రంతో . ఇప్పుడు నయనతార తో చేసే సినిమాతో అక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం ఖాయం . ప్రస్తుతం ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ కాంబినేషన్ కు సంబందించి పూర్తీ వివరాలను త్వరలోనే చెప్పనున్నారు .

English Title: Vijay devarakonda romance with Nayanatara