రష్మిక కు గ్రీటింగ్స్ చెప్పిన విజయ్ దేవరకొండరష్మిక మందన్న పుట్టినరోజు ఈరోజు కావడంతో తనకు జన్మదిన శుభాకాంక్షలు అందజేశాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ . తాజాగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ” డియర్ కామ్రేడ్ ”. ఇంతకుముందు ఈ ఇద్దరూ కలిసి నటించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ కాంబినేషన్ కు క్రేజ్ ఏర్పడింది దాంతో డియర్ కామ్రేడ్ లో మరోసారి నటిస్తున్నారు .

అయితే ఈరోజు రష్మిక మందన్న పుట్టినరోజు కావడంతో గ్రీటింగ్స్ తెలియజేస్తూ పోస్ట్ లు పెట్టేసాడు విజయ్ దేవరకొండ . డియర్ కామ్రేడ్ చిత్రంలోని రష్మిక లుక్ ని కూడా రిలీజ్ చేసారు . డియర్ కామ్రేడ్ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా మే 31 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి తెలుగులో .