సెకండ్ పాటతో అంచనాలు పెంచిన విజయ్ దేవరకొండ


క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రంలోని రెండో పాటని ఈరోజు విడుదల చేశారు . ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ , మలయాలం , కన్నడ బాషలలో కూడా రిలీస్ చేశారు . ఈ పాటకు అద్భుత స్పందన వస్తోంది ఆడియన్స్ నుండి . రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రానికి భరత్కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు . అసలు ఈ రెండో పాటని మూడు రోజుల క్రితమే విడుదల చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల మూడు రోజులు ఆలస్యంగా ఈరోజు విడుదల చేశారు .

ఇక ఈ పాటకు యువత నుండి అద్భుత స్పందన వస్తోంది . అయితే విజయ్ దేవరకొండ చెప్పినట్లుగా ఈ ఏడాది బెస్ట్ సాంగ్ గా నిలబడుతుందా ? లేదా ? అన్నది మాత్రం తెలియాలంటే మరో రెండు రోజులు ఆగితే కానీ చెప్పలేం కానీ ఇప్పటి వరకు వినబడుతున్న టాక్ ప్రకారం ఈ రెండో పాట సూపర్ హిట్ అనే చెప్పాలి .ఇక డియర్ కామ్రేడ్ చిత్రాన్ని జూలై 26 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నాలుగు బాషలలో కూడా భారీ ఎత్తున విడుదల కానుంది .