విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ నాలుగు భాషల్లో


Vijay devarakonda's Dear Comrade releasing all four languages in south

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు లేకపోతే తాజాగా ఈ హీరో నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నాలుగు బాషలలో రిలీజ్ చేస్తారా ? . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మే 22 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తోంది .

 

ఇంతకుముందు గీత గోవిందం చిత్రంతో భారీ హిట్ కొట్టిన ఈ జంట తాజాగా డియర్ కామ్రేడ్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . విజయ్ దేవరకొండ కు సౌత్ లో ఫుల్ పాపులారిటీ రావడంతో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో రిలీజ్ చేయనున్నారు . ఇక ఈనెల 17న డియర్ కామ్రేడ్ టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రష్మిక మందన్న ఈ చిత్రంలో క్రికెట్ ప్లేయర్ గా నటించడం విశేషం .

English Title :Vijay devarakonda’s Dear Comrade releasing all four languages in south