పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయశాంతిజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాములమ్మ అలియాస్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేసింది . రాములమ్మ ఆగ్రహానికి కారణం ఏంటో తెలుసా ……. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి జనసేన తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించాడు . అయితే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పల్లెత్తు మాట అనకపోవడమే రాములమ్మ ఆగ్రహానికి కారణమయ్యింది .

కేసీఆర్ పై విమర్శలు చేయడానికి భయపడే పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణలో అవసరం లేదని , ఆంధ్రప్రదేశ్ లో నీ పార్టీని చూసుకో అంటూ పవన్ కు హితువు పలికింది విజయశాంతి . గతకొద్ది రోజులుగా కేసీఆర్ పై రాములమ్మ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది కానీ రాములమ్మ ప్రచారాన్ని కానీ , చేస్తున్న విమర్శలను కానీ మీడియా లో చూపించడం లేదు దాంతో మరింతగా రగిలిపోతోంది విజయశాంతి .