వై ఎస్ వివేకానంద రెడ్డిది హత్యే నటVivekananda Reddy body Found in Pool of Blood

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డిది ఖచ్చితంగా హత్యే అని తేల్చి చెప్పారు కడప ఎస్పీ . సంచలనం సృష్టించిన ఈ సంఘటన నిన్న అర్దరాత్రి 11. 30 నిమిషాల నుండి తెల్లవారు ఝామున 6 గంటల వరకు జరిగిన విషయాలను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు ఎస్పీ . పొద్దున్న గుండెపోటు తో మరణించాడని చెప్పారు , అయితే ఒంటి మీద గాయాలు ఉండటం , బాత్రూం లో ఎక్కువగా రక్తం పోవడంతో ఖచ్చితంగా హత్యే అయి ఉంటుందన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు .

 

దానికి తోడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం కూడా హత్యే అని తేలడంతో వివేకా ని హత్య చేసే అవకాశం ఎవరికి ఉంటుందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . అయితే వివేకా హత్య వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని , చంద్రబాబు ఈ హత్య చేయించాడని మొదలు పెట్టారు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు .

English Title : Vivekananda Reddy body Found in Pool of Blood