మా పరువు తీస్తున్న శివాజీరాజా – నరేష్


War between Sivaji Raja and Naresh

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పరువు ప్రతిష్టలను తీసి బజారున పడేస్తున్నారు శివాజీరాజానరేష్ లు . ఇటీవలే తీవ్ర ఆరోపణలు – ప్రత్యారోపణలు చేసుకున్నారు ఈ ఇద్దరూ ….. ఎన్నికలు అయిపోయాయి నరేష్ గెలిచాడు శివాజీరాజా ఓడిపోయాడు , అయితే నరేష్ మాత్రం అధ్యక్ష స్థానంలో మార్చి 31 వరకు కూర్చోవద్దని శివాజీరాజా సవాల్ చేసాడట ! అంతేనా ఒకవేళ నరేష్ కనుక సీట్లో కూర్చొంటే కోర్టుకి వెళ్తానని హెచ్చరికలు జారీ చేసాడట !

 

దాంతో నరేష్ నిన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసాడు . శివాజీరాజా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు . ఇస్యూరెన్స్ పాలసి కట్టలేదని ఎక్స్ పైర్ అయ్యిందని ఈలోపు ఎవరికైనా ఏదైనా జరిగితే అందుకు బాధ్యత శివాజీరాజాదే అని అంటున్నాడు నరేష్ . మాలో ఇంతగా గొడవ జరుగుతున్నప్పటికీ పరిశ్రమకు చెందిన పెద్దలు మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు . మా గౌరవం మాత్రం రోడ్డున పడుతోంది . ఇద్దరి మధ్య పోరాటంతో మా పరువు మొత్తం పోయింది .

English Title : War between Sivaji Raja and Naresh