చిరంజీవి – మహేష్ లలో గెలిచేది ఎవరు ?


Who is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?

మెగాస్టార్ చిరంజీవిసూపర్ స్టార్ మహేష్ బాబు లలో గెలిచేది ఎవరో ఈనెల 10న తేలనుంది . చిరంజీవి – మహేష్ బాబు ల పోటీ ఏంటి ? గెలవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 10న జరుగనున్నాయి . అయితే ఈ ఎన్నికల్లో రెండు ప్యానళ్లు పోటీ పడుతున్నాయి . ఒకటేమో శివాజీ రాజా ప్యానల్ కాగా మరొకటి నరేష్ ప్యానెల్ . శివాజీరాజా ప్యానల్ కు చిరంజీవి మద్దతు ఉండగా నరేష్ ప్యానల్ కు మహేష్ బాబు మద్దతు ఇస్తున్నాడు దాంతో ఈ పోటీ నెలకొంది .

 

తెరముందు కనిపించేది శివాజీరాజా – నరేష్ లు అయినప్పటికీ పోటీ మాత్రం చిరంజీవి – మహేష్ బాబు ల మద్యే కొనసాగనుంది . ఈ రసవత్తర పోటీలో చిరంజీవి గెలుస్తాడా ? మహేష్ బాబు గెలుస్తాడా ?  చూడాలి . చిరంజీవి క్యాంప్ అయితే శివాజీరాజా కు మద్దతు ఇస్తోంది , ఆమేరకు తన సన్నిహిత వర్గాలకు సమాచారం కూడా ఇచ్చేసారు . ఇక మహేష్ బాబు విషయానికి వస్తే నేను వచ్చి నీ ప్యానల్ కే ఓటు వేస్తానని నరేష్ కు మాట ఇచ్చాడట మహేష్ కానీ తన కోటరీలో ఉన్న వాళ్లకు ఈ విషయం చెప్పాడా ? చెబుతాడా ? తన ప్యానల్ ని గెలిపిస్తాడా ? అన్నది మాత్రం డౌటే ! ఈనెల 10 న చిరు – మహేష్ లలో విన్నర్ ఎవరో తెలిసిపోనుంది .

English Title: Who is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?