మహేష్ బాబు సినిమాకు గుమ్మడికాయ కొట్టారుహమ్మయ్య ! ఎట్టకేలకు మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసారు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే . మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించిన ఈ చిత్రాన్ని మే 9న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఆ విషయాన్ని పంచుకుంటూ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నారు మహర్షి చిత్ర బృందం .

అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు వేరియేషన్ లలో కనిపించనున్నాడు . సందేశాత్మక చిత్రంగా తెరకెక్కిన మహర్షి పై దర్శక నిర్మాతలతో పాటుగా మహేష్ బాబు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఇక అల్లరి నరేష్ , హీరోయిన్ పూజా హెగ్డే అయితే మహర్షి భారీ హిట్ కొట్టాలని ప్రార్థిస్తున్నారు . ఎందుకంటే హీరోయిన్ గా పూజా హెగ్డే కు ఇప్పటివరకు సాలిడ్ హిట్ లేదు అలాగే గత ఆరేళ్లుగా అల్లరి నరేష్ కు కూడా హిట్ లేదు దాంతో రేసులో లేకుండా పోయాడు అందుకే ఈ ఇద్దరి కోసమైనా తప్పకుండా మహర్షి హిట్ కావాల్సిందే .